సక్సెస్ వచ్చాక చెప్తానన్న సిరి హనుమంత్!
on Jun 18, 2023

ఇన్ స్టాగ్రామ్ లో రోజుకో కొత్త ఐటమ్ ట్రెండింగ్ లో ఉంటుంది. అయితే ఎప్పుడూ ఏదో ఒక సెలబ్రిటీ హాట్ ఫోటోస్ పెట్టడమో లేక కొత్త సాంగ్ కి రీల్స్ చేయడమో లేక బర్త్ డే సెలబ్రేషన్స్ జరగడమో జరుగుతుంటాయి. అవి వైరల్ గా మారుతుంటాయి. అయితే సెలబ్రిటీలు ఇన్ స్టాగ్రామ్ లో ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యేందుకు 'ఆస్క్ మీ ఏ క్వశ్చన్', 'ఆస్క్ మీ సంథింగ్' స్టార్ట్ చేశారు. తాజాగా సిరి హనుమంత్ తన ఇన్ స్టాగ్రామ్ లో 'ఆస్క్ మీ ఏ క్వశ్చన్' అంటూ అభిమానులతో ముచ్చటించింది.
సిరి హనుమంత్ యూట్యూబర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసి ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. బిగ్ బాస్ లోకి వెళ్ళొచ్చాక సిరికి ఇంకా పాపులారిటి పెరిగిందనడంలో అతిశయోక్తి లేదు. అయితే తను చేసిన షార్ట్ ఫిల్మ్ లు అన్నీ కూడా మంచి వీక్షకాదరణ పొందాయి. తాజాగా జీ5 లో రిలీజైన 'పులి-మేక' వెబ్ సిరీస్ లో ఒక ముఖ్య పాత్ర పోషించిన సిరి.. ఎప్పుడూ ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటుంది. తన షూటింగ్ కి సంబంధించిన విషయాలను, నైట్ టైం పబ్ లకు వెళ్ళినా పంచుకుంటుంది. రీసెంట్ గా శ్రీహాన్ తో కలిసి చేసిన వీడియో ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే.
తాజాగా సిరి తన ఇన్ స్టాగ్రామ్ లో ఆస్క్ మీ క్వశ్చనింగ్ స్టార్ట్ చేయగా.. ఫాలోవర్స్ కొన్ని ఆసక్తిరమైన ప్రశ్నలను అడుగగా వాటికి సమాధానమిచ్చింది. 'మీ కిత్త వెబ్ సిరీస్ తొందరగా రిలీజ్ చేయండి అక్క! MSMA నే లూప్ లో చూస్తున్నామని ఒకరు అడుగగా.. డెఫినెట్ గా కొన్ని మంత్స్, ఎన్ని మంత్స్ అని చెప్పలేను కానీ సూన్ అంతే అని సిరి సమాధానమిచ్చింది. 'ఆదిపురుష్' మూవీ చూసారా అని ఒకరు అడుగగా.. చూసానని సమాధానమిచ్చింది సిరి. "సక్సెస్ గురించి చెప్పు అక్క" అని అడుగగా.. సక్సెస్ వచ్చాక చెప్తానని సిరి రిప్లై ఇచ్చింది. "కంగ్రాట్స్ ఫర్ 150K సబ్ స్ర్కైబర్స్ ఆన్ యూట్యూబ్.. ప్లీజ్ బి యాక్టివ్ ఇన్ యూట్యూబ్" అని ఒకరు చెప్పగా. థాంక్స్ అంటూ సమాధానమిచ్చింది సిరి. ఇలా కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధనమిచ్చింది సిరి. కాగా సిరి తన వెబ్ సిరీస్ షూటింగ్ లో బిజీగా ఉంటోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



